AUSW vs WIW | వరేహం, గార్డ్నర్ ధాటికి విండీస్ విలవిల.. ఆస్ట్రేలియా ముందు స్వల్ప లక్ష్యం..!
AUSW vs WIW : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఓవల్ మైదానంలో పిచ్ బాగున్నా సరే ఆస్ట్రేలియా స్పిన్నర్లకు లొంగిపోయినట్టుగా సులువుగా వికెట్లు పారేసుకున్నారు.
AUSW vs WIW : మహిళల టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో వెస్టిండీస్ బ్యాటర్లు తేలిపోయారు. ఓవల్ మైదానంలో పిచ్ బాగున్నా సరే ఆస్ట్రేలియా స్పిన్నర్లకు లొంగిపోయినట్టుగా సులువుగా వికెట్లు పారేసుకున్నారు. టాపార్డర్‌లో కెప్టెన్ హేలీ మాథ్యూస్(30) రాణించగా.. గార్డ్నర్(2-13), వరేహం(2-17), మొలినెక్స్(2-30)ల విజృంభణతో మిడిలార్డర్ కుప్పకూలింది. ఆఖర్లో ఆల్‌రౌండర్ డియాండ్రా డాటిన్(26 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో విండీస్ 125 పరుగులు మాత్రమే చేసింది. స్వల్ప స్కోర్‌కే పరిరమితమైన వెస్టిండీస్‌ను బౌలర్లు గట్టెక్కిసారా? లేదా? చూడాలి.
తొలి సెమీఫైనల్లో భారీ స్కోర్ కొట్టాలనుకున్న వెస్టిండీస్‌కు ఆస్ట్రేలియా బౌలర్లు షాకిచ్చారు. టాస్ ఓడి ఇన్నింగ్స్ దూకుడుగా ఆరంభించినా హేలీ మాథ్యూస్(30)ను ఆసీస్ స్పిన్నర్లు సమర్ధంగా నిలువరించారు. నాలుగో ఓవర్లో కిమ్ గార్త్, ఐదో ఓవర్లో లూయిస్ హామిల్టన్ ఒక్కో పరుగే ఇచ్చారు. మరో ఎండ్‌లో క్వియానా జోసెఫ్(16).. తడబాటుతో పవర్ ప్లేలో విండీస్ 35 రన్స్ చేసింది. ఆసీస్ బౌలర్లు వరేహం(2-17) తొలి బంతికే మాథ్యూస్(30)ను బౌల్డ్ చేసింది. 47వద్ద తొలి వికెట్ పడగా.. క్రీజులోకి వస్తూనే షెమైనే క్యాంప్‌బెల్(22) రెండు ఫోర్లు బాదింది. కానీ, తర్వాత మొలినెక్స్ ఓవర్లో సిక్సర్‌కు యత్నించిన జోసెఫ్ నేరుగా సథర్లాండ్ చేతికి చిక్కింది.
గార్డ్నర్ డబుల్..
ఓపెనర్లు వెనుదిరిగిన షాక్ నుంచి తేరుకోక ముందే గార్డ్నర్ విండీస్‌ను మరింత ఒత్తిడికి గురి చేసింది. 11వ ఓవర్లో డేంజరస్ స్టెఫానీ టేలర్(0), క్లాక్స్టన్(0)ల వికెట్లు తీసి మరింత కష్టాల్లోకి నెట్టింది. ఆ దశలో చినొల్లే హెన్రీ(10) జతగా క్యాంప్‌బెల్ జట్టును ఆదుకోవాలనుకుంది. అయితే.. ఈ ఇద్దరూ త్వరగానే ఔటవ్వడంతో.. విండీస్ వందలోపే పరిమితమయ్యేలా కనిపించింది.
Deandra Dottin finding different ways to add valuable runs to the West Indies’ total 👌
Watch the #T20WorldCup semi-final LIVE, broadcast details 👉 https://t.co/niBjzedxPu pic.twitter.com/WSR47aoH7y
— ICC (@ICC) June 30, 2026
ఆఖర్లో డియాండ్ర డాటిన్(22 నాటౌట్) మెరుపులతో స్కోర్ దాటించింది. దాంతో, నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి కరీబియన్ టీమ్ 125 రన్స్ చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో మొలినెక్స్, వరేహం, గార్డ్నర్లు తలా రెండేసి వికెట్లు తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

