తుంగతుర్తి, డిసెంబర్ 26 : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు దాయం విక్రమ్‌రెడ్డిని ఆయన నివాసంలో ఎమ్మెల్యే మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలు సమస్యలను విక్రమ్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్సీ కొత్త కాలనీలో 32 కేవీ విద్యుత్ లైన్ వెళ్తుండడంతో సమస్యను విన్నవించగా ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ డీఈతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, మండలాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, గ్రామ శాఖ అధ్యక్షుడు సగ్గం నర్సయ్య, రేతినేని శ్రీనివాస్, ఓరుగంటి సత్యనారాయణ, దాయం ఝాన్సీరెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు తప్పెట్ల శంకర్, పులిగుజ్జ నర్సయ్య, మురుగుండ్ల వీరయ్య, పులిగుజ్జ యాకయ్య పాల్గొన్నారు.
వైద్య శిబిరం అభినందనీయం..
తిరుమలగిరి : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించటం హర్షనీయం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వీఆర్ ఆస్పత్రిచే నిర్వహించిన ఉచిత గుండె వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ శారద, జోన్ చైర్మన్ వెంకటేశ్వర్లు, మంద పద్మారెడ్డి, కందుకూరి లక్ష్మయ్య, సురేశ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, మండలాధ్యక్షుడు నరేశ్, వైద్యులు డాక్టర్ మధన్‌కుమార్, అఖిల్ పాల్గొన్నారు.