పెన్పహాడ్, నవంబర్ 21 : సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, లీగల్ కం ప్రొబెషన్ అధికారి బి.నాగరాజు అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, మహ్మదాపురం, న్యూ బంజారాహిల్స్ తండా, ఎల్లప్పకుంట తండా, నాగులపాటి అన్నారం అలాగే గరిడేపల్లి మండలం గడ్డిపల్లి, మర్రికుంట గ్రామాల్లో బాల్య వివాహాల నిర్మూలనపై విస్తృత ప్రచారం నిర్వహించి, వారితో ప్రతిజ్ఞ చేయించి చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాల లోపు, అబ్బాయికి 21 సంవత్సరాల లోపు పెళ్లిలు చేస్తే చట్ట ప్రకారం నేరం అని, అట్టి పెళ్లిళ్లు ప్రోత్సహించిన వారికి రూ.లక్ష జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు.
పిల్లలపై ఎటువంటి దాడులు జరిగినా, బాల్య వివాహాలు కుదురుతున్నాయని ముందస్తు సమాచారం తెలిసిన 1098, 100, చైల్డ్ లైన్ నంబర్ కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపియు యూనిట్ సోషల్ వర్కర్ శ్రీలక్ష్మి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు స్వప్న, అనిఫా, ధరణి, ఎయిడ్ ఎన్జీవో కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ వగ్గు సోమన్న, హబ్ టీమ్ మెంబర్స్ రేవతి, సఖి టీం సభ్యులు శైలజ, చైల్డ్ లైన్ కిరణ్, పంచాయతీ కార్యదర్శి అఖిల్, వివిధ గ్రామాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Penpahad : బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి : సీడీపీఓ సుబ్బలక్ష్మి