నీలగిరి, సెప్టెంబర్ 16 : పుట్టిన ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చేందుకు పోషణతో పాటు వారికి విద్య కూడా చాలా అవసరమని నల్లగొండ సీడీపీఓ తూముల నిర్మల అన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నల్లగొండ ఆధ్వర్యంలో “పోషన్ బీ – పడాయి బీ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మంగళవారం టీఎన్జీఓఎస్ భవన్లో అంగన్వాడీ టీచర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య దశలోనే బిడ్డకు సరైన ఆహారం, విద్య, అభివృద్ధి అవకాశాలు కల్పించాలన్నారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం అందించాలన్నారు. శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రీస్కూల్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని చెప్పారు.
ప్రతి బిడ్డ సమగ్రంగా ఎదగాలంటే మన వంతు కృషి అవసరమని వివరించారు. 0-6 సంవత్స రాలలోపు పిల్లల్లో జరిగే అభివృద్ధి క్షేత్రాల గురించి ప్రేరణ, ఇసిసిఇ, పోషణ, శ్యాం, మామ్ లపై అవగాహన కల్పించారు. నాణ్యమైన బాల్య అభివృద్ధి సంరక్షణ, విద్య, మెదడు పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాలపై ప్రొజెక్టర్ సహాయంతో పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సులభంగా అర్థమయ్యేలా, ప్రాక్టికల్ యాక్టివిటీలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పార్వతి, జయమ్మ, మల్లేశ్వరి, లక్ష్మమ్మ, మంజుల, శ్రీలత, ప్రణీత, పద్మ, సరస్వతి, వినోదకుమారి, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు పాల్గొన్నారు.
Nilagiri : ప్రతి బిడ్డకు సంపూర్ణ పోషణతో పాటు విద్య : సీడీపీఓ నిర్మల
Nilagiri : ప్రతి బిడ్డకు సంపూర్ణ పోషణతో పాటు విద్య : సీడీపీఓ నిర్మల