మునుగోడు, మార్చి 17 : భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ మునుగోడు మండల నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షుడిగా బొడ్డుపల్లి నరేశ్, మండల ప్రధాన కార్యదర్శిగా యాసరాని వంశీకృష్ణ, ఉపాధ్యక్షులుగా కట్ట వెంకన్న, యాట వంశీ, చినగొని గణేశ్, చరణ్, సహాయక కార్యదర్శులుగా ఎర్ర మహేందర్, పరసగోని లింగస్వామి, యాట శ్రీకాంత్, మరో 8 మందితో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ మునుగోడు మండలంలో స్థానిక, యువజన, విద్యా సమస్యల మీద పనిచేస్తామని తెలిపారు. రానున్న కాలంలో సమస్యలే పరిష్కారంగా తాము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. తమ ఎన్నికకు సహకరించిన అందరికి వారు కృతజ్ఞతలు తెలిపారు.