Damaracharla : ఆర్డీఓగా దుబ్బతండా వాసి అశోక్ నాయక్
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం పార్తూనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు చెందిన తేజావత్ అశోక్ నాయక్ టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఆర్డీఓగా ఎంపికయ్యాడు.
దామరచర్ల, సెప్టెంబర్ 25 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్ల మండలం పార్తూనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు చెందిన తేజావత్ అశోక్ నాయక్ టీజీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో ఆర్డీఓగా ఎంపికయ్యాడు. 562 గ్రూప్-1 సర్వీస్ పోస్టులకు అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ బుధవారం అర్థరాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాధాన్యతా క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది.
మారుమూల గిరిజన తండాకు చెందిన అశోక్ నాయక్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అశోక్ నాయక్ 1 నుండి 7వ తరగతి వరకు నేతాజీ హైస్కూల్ దామరచర్లలో, 8 నుండి 10వ తరగతి వరకు గిరిజన గురుకుల పాఠశాల అవంతీపురంలో చదివాడు. పాలిటెక్నిక్ కోర్సును సనా కళాశాల కోదాడలో, బీటెక్ ను ధృవ కళాశాల హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. అనంతరం సివిల్స్ లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లో శిక్షణ పొంది గ్రూప్-1కు ఎంపికయ్యాడు. ఆర్డీఓగా అశోక్ నాయక్ ఎంపిక పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

