నిడమనూరు, జూలై 17 : ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని నిడమనూరు మండల కాంగ్రెస్ నాయకురాలు కొప్పోలు స్వర్ణలత, వెనిగండ్ల పీఏసీఎస్ డైరెక్టర్ పోలె రవి అన్నారు. మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలో గురువారం లబ్ధిదారులకు మంజూరైన ఇంటి నిర్మాణ పనులను వారు ప్రారంభించి మాట్లాడారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సుధాకర్, పురుషోత్తం పాల్గొన్నారు.