రామగిరి, ఆగస్టు 07 : ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట తెలుగు శాఖ అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. ఈ మేరకు కళాశాల విద్యా కమిషనర్ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా దాశరథి పురస్కార గ్రహీత, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, దాశరథి పురస్కార గ్రహీత వేణు సంకోజు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరి రెడ్డి, జాతీయ ఉత్తమ సినీ విమర్శ పురస్కార గ్రహీత డాక్టర్ ఎం. పురుషోత్తమాచార్య, కళాశాల ప్రధానాచార్యులు రాహత్ ఖానం, తదితరులు కృష్ణ కౌండిన్యకు శుభకాంక్షలు తెలిపారు.