నల్లగొండ, జూన్ 13 : ప్రసూతి, స్త్రీ రోగ వైద్య నిపుణురాలు డా. సైకం శ్రీలత నాయుడు ప్రతిష్ఠాత్మక ఎం.ఆర్.సి.ఓ.జి. (MRCOG) అర్హతను సాధించారు. యునైటెడ్ కింగ్డమ్లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (RCOG) అందించే ఈ అంతర్జాతీయ గుర్తింపు అర్హతను ఆమె విజయవంతంగా పూర్తి చేశారు. డా. శ్రీలత నాయుడు గత పదేళ్లుగా నల్లగొండలో ప్రసూతి, స్త్రీ రోగ వైద్య సేవలతో పాటు వంధ్యత్వ చికిత్సలు, లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సల రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. వైద్య వృత్తిలో నిరంతర అధ్యయనం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఈ ఘనతను సాధించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఎంఆర్సీఓజీ అర్హత సాధించడం ద్వారా డా. శ్రీలత నాయుడు అంతర్జాతీయ ప్రమాణాల వైద్య నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారని సహచర వైద్యులు అభినందించారు. ఈ విజయం ఆమె వ్యక్తిగత ప్రగతికే కాకుండా నల్లగొండ జిల్లా వైద్య రంగానికి, తెలుగు రాష్ట్రాల మహిళా ఆరోగ్య సేవలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డా. సైకం శ్రీలత నాయుడుకు పలువురు వైద్యులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు.