కట్టంగూర్, ఆగస్టు 08 : డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ ఆర్టీఓ యారాల అశోక్ రెడ్డి అన్నారు. కట్టంగూర్, నార్కట్పల్లి మండలాలకు చెందిన 20 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆర్థికసాయం ప్రకటించింది. శుక్రవారం కట్టంగూర్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అట్టి ఆర్థిక సాయాన్ని దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు ఆర్ధికసాయాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలన్నారు.
దివ్యాంగులు ఆర్థికంగా బలపడేందుకు మూడు సంవత్సరాల కాలంలో తెలంగాణలోని ఆరు జిల్లాలో 3 వేల మంది దివాంగులకు ఆర్థికసాయం అందించిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినదించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్ డీఓ శ్రవణ్ కుమార్, జిల్లా శిశు సంక్షేమ, వయో వృద్ధులు, దివ్యాంగ శాఖ అధికారిణి కృష్ణవేణి, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డైరెక్టర్ పీఎన్ శ్రీనివాస్, డీఆర్డీఏ డీపీఎం మోహన్ రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ అస్రా అంజుం, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, అర్ఐ కుమార్ రెడ్డి, ఏపీఎం రాము, ఎఫ్ఆర్ ఓ నాగిరెడ్డి, సాయితేజ మణికంఠ, మహేశ్, ఓంప్రకాశ్, వినయ్ పాల్గొన్నారు.