రామగిరి, ఆగస్టు 9 : డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను యుద్ధ్ద ప్రాతిపదికన ఆమోదించి పనులు ప్రారంబించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను వెంటనే ఆమోదించాలని, కావాల్సిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో శుక్రవారం సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2015లో పథకం ప్రారంభమైతే నేటి వరకు కనీసం డీపీఆర్ ఆమోదించలేన్నారు.
పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి దృష్టికి తీసుకవెళ్లామన్నారు. వారంతా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలన్నారు. బొంతల చంద్రారెడ్డి, నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హశం, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.