నకిరేకల్, మే 28 : ప్రైవేట్ టీచర్స్‌ను అడ్మిషన్ల కోసం వేసవిలో వేధించొద్దని, ఒత్తిడికి గురిచేయొద్దని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ (టీపీటీఎల్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విజయ్‌కుమార్ విద్యా సంస్థలకు సూచించారు. నకిరేకల్‌లోని మినీ స్టేడియంలో బుధవారం ప్రైవేట్ టీచర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం సెలవు రోజు కూడా అడ్మిషన్ల క్యాంపెయిన్ చేయాలనడం సరైన పద్ధతి కాదన్నారు.
టీచర్లు విద్యారంగానికి చేస్తున్న సేవలు ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవులు, టైమింగ్స్, ఈఎస్ఐ, పీఎఫ్ తప్పకుడా అమలు చేసేలా ప్రైవేట్ యాజమాన్యాల మీద ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రభాత్, టీచర్లు కాశయ్య, నాగేందర్, ఉపేందర్, నరసింహారావు, రోజా, యూత్ నాయకులు శివశంకర్, సుకుమార్ పాల్గొన్నారు.