కట్టంగూర్, ఆగస్టు 15 : కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు కెన్జియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ అడ్మిన్ అండ్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చిలుముల రామకృష్ణ శుక్రవారం రెండు కంప్యూటర్లను బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ విద్యను నేర్చుకుని నైపుణ్యం కలిగిన విద్యార్థులుగా ఎదగాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంప్యూటర్ విద్య భవితత్లో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కందాళ రమాదేవి, గ్రామస్తులు గద్దపాటి సుధాకర్, ఎడ్ల పెదరాములు, నంద్యాల వెంకట్ రెడ్డి, పొన్న అంజయ్య, భూపతి నాగరాజు, భూపతి శ్రవణ్, చిలుముల రవి, అంగన్వాడీ టీచర్ లలిత, గద్దపాటి రేణుక, అద్దంకి లింగయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.