కోదాడ, జూలై 24 : కోదాడ పశువుల దవఖానాలో శుక్రవారం అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య తొలిసారి ఓ కుక్క చెవిలో స్కానింగ్ చేసి చికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల చెవుల్లో ఇన్ఫెక్షన్ గడ్డలు ఇతర సమస్యలు ఉన్నప్పుడు లక్షణాలను పసిగట్టి ఊహాజనితంగా చికిత్స చేస్తామని, అయితే చిన్న పెన్సిల్ లాంటి వైర్లెస్ ఇయర్ పిక్ కెమెరా స్కానర్ తో చెవి లోపలి భాగాలను సెల్ఫోన్లో క్షుణ్ణంగా స్కానింగ్ చేసి చికిత్స చేయవచ్చు అన్నారు. లోపలి భాగాల ఫోటోలు సెల్‌ఫోన్‌తో రికార్డు చేయవచ్చు అన్నారు. ఈ ఆపరేషన్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సబ్జెక్ట్ సిరిపురపు సురేందర్, సిబ్బంది శివకర్ల సాగర్ పాల్గొన్నారు.