చండూరు, జనవరి 01 : చండూరు మండలం అంగడిపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ చండూరు పట్టణాధ్యక్షుడు అనంత చంద్రశేఖర్ గౌడ్ నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. గురువారం తన పుట్టినరోజును పురస్కరించుకుని పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, స్వీట్లు అందించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు మంచుకొండ సంజయ్, నల్లగంటి మల్లేశ్, బోయపల్లి భిక్షపతి గౌడ్, బొల్లం స్వామి, సింగాపురం జనార్దన్, నకరికంటి వేణు, జెల్ల శ్రీను, అంబల్ల శంకర్, పనస ఆంజనేయులు, చింతకుంట్ల వెంకన్న, బొల్లం మధు యాదవ్ పాల్గొన్నారు.

Chandur : విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ