తుంగతుర్తి, మార్చి 9 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన చిలుకూరు ఏఎస్ఐ శిరంశెట్టి వెంకటేశ్వర్రావు తన తల్లిదండ్రులు శిరంశెట్టి జనార్ధన్‌రావు, కౌసల్య జ్ఞాపకార్థం ఆదివారం తుంగతుర్తి సీనియర్ కబడ్డి క్రీడాకారులకు రూ.12 వేల విలువ గల దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు తన వంతు సాయం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు గన్‌మెన్ సోమన్న, గాజుల యాదగిరి, కొండగడుపుల యాకయ్య, తునికి వెంకన్న, ఆకార భాస్కర్, బొంకురి శ్యామ్‌సుందర్, ఎల్లబోయిన భిక్షం, నాగయ్య, నర్సయ్య, అబ్బగాని సత్తయ్య పాల్గొన్నారు.