నీలగిరి, సెప్టెంబర్ 15 : వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ఎస్సీ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో నులి పురుగులను నివారిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పిల్లలు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు మాట్లాడుతూ పిల్లల్లో రక్తహీనతకు గురి చేసే నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను వేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, బోయినపల్లి శ్రీనివాస్, ఖయ్యుంబేగ్ ఉన్నారు.
మిర్యాలగూడ రూరల్ : 1-19 ఏండ్ల పిల్లలందరికీ నట్టల నివారణ(ఆల్బెండజోల్) మాత్రలను తప్పక వేయించాలని ఎంపీపీ నూకల సరళా హన్మంతరెడ్డి సూచించారు. మండలంలోని వెంకటాద్రిపాలెంలో ఆలగడప పీహెచ్సీ ఆధ్వర్యంలో సిబ్బంది నులిపురుగుల మందు తాగించే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుబ్బారెడ్డి గూడెంలో జడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో వెంకటాద్రిపాలెం, సుబ్బారెడ్డి గూడెం సర్పంచులు బారెడ్డి అశోక్‌రెడ్డి , గజ్జెల జయమ్మాకోటిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్టిబాబు నాయక్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, సూపర్వైజర్ పి.రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్‌పల్లి: మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి లహరి, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, ఆరోగ్య అధికారి శ్రీరాములు పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ అనుముల పాండమ్మాశ్రీనివాసరెడ్డి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులకు వేశారు. అనంతరం ఆశవర్కర్లకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రమావత్ శంకర్, జడ్పీ హెచ్ఎం వెంకటేశ్వర్లు, ఎస్కే. హుస్సేన్, కోఆప్షన్ సభ్యుడు హుస్సేన్, ఉపాధ్యాయులు పులిజాల విష్ణుకుమార్, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు.