నల్లగొండ నమస్తే తెలంగాణ, మే 05 : సైబర్ మోసాలకు గురైన వారికి సలహాలు, పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో ఆయన మాట్లాడారు. ఎవరైనా సైబర్ మాసాలకు గురైతే వెంటనే 1930 గాని, https://www.cybercrime.gov.in గాని సమాచారం అందించాలన్నారు. ప్రతి సోమవారం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సైబర్ బాధితుల కోసం డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 8712658079 ఫోన్ నంబర్‌కు కాల్ చేసి బాధితులు సమస్యలు తెలుపొచ్చన్నారు.
అలాగే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో ఎస్పీ నేరుగా మాట్లాడి వారి సమస్యలు ఆలకించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని సిబ్బందికి సూచించారు. వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి, చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.