రామగిరి, జనవరి 13 : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శనివారం నల్లగొండలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిరాటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నల్లాణ్చక్రవర్తుల రామకృష్ణమాచార్యులు తిరుప్పావై ప్రవచనాలు చేశారు.
కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ చకిలం వేణుగోపాల్‌రావు దంపతులు, ఈఓ జయరామయ్య , ప్రముఖులు, అర్చకులు సముద్రాల యాదగిరాచార్యులు, శఠగోపాచార్యులు, రఘునందనాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
గోదా, రంగనాయకస్వామి తిరు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.