రామగిరి, జూన్ 11 : నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాల డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను గురువారం ఆ కళాశాలలోని పరీక్షల విభాగంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంజీయూ సిఓఈ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 4వ, 6వ సెమిస్టర్స్ రెగ్యులర్ 1, 2, 3, 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసి కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఓఈ డాక్టర్ మునిస్వామి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పరంగి రవికుమార్, అకడమిక్ కోఆర్డినేటర్స్ బత్తిని నాగరాజు, మేరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కంట్రోలర్స్ ఎన్.కోటయ్య, ఎస్.వాసుదేవ్, ఎన్.వేణు, డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ పాల్గొన్నారు.