చివ్వేంల, మర్చి 15 : వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం చివ్వేంల మండల పరిధిలోని గాయంవారిగూడెంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటలొ అగ్గితెగులు, సుడిదోమ, కంపునల్లి తెగుళ్లను గుర్తించి, సస్య రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గత వారం రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి, చలి పెరగడం వల్ల అగ్గి తెగులు వృద్ధి ఎక్కువైందన్నారు. యూరియా వేయడం ఆపాలని, పొలంలో గట్ల మీద ఉన్న కలుపు మొత్తాన్ని తీసేయాలని సూచించారు.
చివరగా ట్రై సైక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐసోప్రోథాయిలిన్ 1.5 ml లేదా కాసుగా మైసిన్ 2.5 ml లేదా ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ + టేబ్యు కొనజోల్ 0.8 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. సుడిదోమ నివారణకు డైనోట్ ఫ్యూరాన్ 0.4 గ్రాములు లేదా బ్యూప్రో పెజిన్ 1.6 ml లేదా పైమెట్రోజెయిన్ 0.6 గ్రాములు లేదా ఫ్లోనికామైడ్ 0.4 గ్రాములు దుబ్బుల మొదల్లు తడిచేలాగా పిచికారి చేయాలన్నారు. కంపునల్లి నివారణకు క్లోరిఫైరీఫాస్ 2.5 ml లేదా మలాథియాన్ 2 ml నీటికి కలిపి కంకులు, దుబ్బులు మొత్తం తడిచేలాగా పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారి బి. శైలజ, రైతులు బాణోత్ సోమాని, హేమ, వెంకన్న, జాంల పాల్గొన్నారు.