అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో 60 మంది పోలీసు సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను...
అర్వపల్లి, అక్టోబర్ 30 : అర్వపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో 60 మంది పోలీసు సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను గుర్తించి మొత్తం 64 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 1 ట్రాక్టర్ అలాగే 1 కారు మొత్తం 68 వాహనాలను పరిశీలించి సీజ్ చేశారు. కార్యక్రమం అనంతరం సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల, దుష్పరిణామాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, చట్టాలపై అవగాహన కల్పించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగేశ్వరావు, అర్వపల్లి ఎస్ఐ మధు నాయుడు, తుంగతుర్తి సర్కిల్ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్వపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
Mukra Farmers | ఎండిన పత్తి మొక్కలతో సెల్ఫీలు..రాహుల్‌కు పంపిన ముఖరా( కె ) రైతులు
‘గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును బాధ్యతగా తీసుకోవాలి’
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

