దామరచర్ల, జూన్ 20 : ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో అసమానతలు పోవాలంటే, దోపిడి పోవాలంటే అది కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల సరుకుల అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. భూ భారతిలో గిరిజనులు పెట్టుకున్నటువంటి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలన చేసి, వారికి బేషరతుగా పట్టాలివ్వాలన్నారు. స్థానిక ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూమి కోల్పోయిన రైతులందరికీ నష్ట పరిహారం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ సయ్యద్, దామరచర్ల మండల కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, మిర్యాలగూడ మండల కార్యదర్శి అంజన్న, పెళ్లి రామలింగం, వేమలపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి, దామరచర్ల మండల సహాయ కార్యదర్శి డి.శాంతి, బుజ్జి లింగ నాయక్, మహిళా సమైక్య నాయకులు పోలిపల్లి మమత, లక్ష్మయ్య, రవి, అన్నపూర్ణ, నిర్మల, వెంకటయ్య పాల్గొన్నారు.