పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతున్నది. దీంతో కొన్ని మండలాల్లో ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. చెత్తా చెదారంతో అస్తవ్యస్థంగా మారాయి. కేసీఆర్ హయాంలో జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇండ్లు మంజూరు చేశారు. ఇండ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 5.40 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పైసా ఖర్చు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపట్టారు.
సుమారు వెయ్యి ఇండ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. పనులు పురోగతిలో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. పూర్తయిన ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇండ్ల చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోయి అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని చోట్ల తలుపులు, కిటీకి అద్దాలు, ట్యాంక్లు పగిలిపోయాయి. మరికొన్ని చోట్ల మందుబాబులకు అడ్డాగా మారాయి.
యాదాద్రి భువనగిరి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. కేసీఆర్ సర్కార్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతోంది. కొన్ని చోట్ల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నా.. మరికొన్ని చోట్ల పంపిణీ చేసినా కనీసం పట్టించుకోపోవడంతో పథకం లక్ష్యం నీరుగారుతోంది. పలు మండలాల్లో భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చెత్తా చెదారంతో అస్తవ్యస్థంగా మారాయి. లబ్ధిదారులు ఎన్నిసార్లు ఆందోళన చేసినా.. ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదు.
బీఆర్ఎస్ హయాంలో 3620 ఇండ్లు మంజూరు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఇండ్లను మంజూరు చేశారు. జిల్లా పరిధిలోని ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి, చౌటుప్పల్, నకిరేకల్ నియోజకవర్గాల్లో 3620 ఇండ్లకు అనుమతులు ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 5.40 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేసింది. వీటిని నిర్మించేందుకు టెండర్లు పిలిచారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టారు. సుమారు వెయ్యి ఇండ్లకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగతా పనులు పురోగతిలో ఉండగానే ప్రభుత్వం మారింది.
ఎంపిక చేసినా కేటాయింపులు ఏవీ..?
గతంలో గ్రామ వార్డు సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు తీసుకుని.. తాసీల్దార్ల ద్వారా సర్వే పూర్తి చేసేవారు. ఈ జాబితాలో లబ్ధిదారుల దరఖాస్తులను వడబోసేవారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేసేవారు. భువనగిరి, ఆత్మకూర్ (ఎం), కొలనుపాలక, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోటకొండూరు, ఆలేరు, చౌటుప్పల్, నారాయణపురం తదితర మండలాల్లో డ్రా తీశారు. ఆయా మండలాల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఆలేరు, చౌటుప్పల్, మోటకొండూరు, ఆత్మకూర్ (ఎం) మండలాల్లో గృహ ప్రవేశం కూడా చేశారు. కొన్ని మండలాల్లో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయగా.. మరికొన్ని మండలాల్లో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక చేయలేదు. మరికొన్ని చోట్ల ఎంపిక జరిగినా పంపిణీ చేయలేదు.
శిథిలావస్థలో ఇండ్లు..
ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ఇండ్లు అస్తవ్యస్థంగా మారాయి. రోడ్లు, డ్రెయినేజీ, విద్యుత్, నీటి సదుపాయం లేదు. ఇండ్లు వానకు తడిసి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇండ్ల చుట్టూ పిచ్చి చెట్లు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. తలుపులు, కిటీకి అద్దాలు, ట్యాంకులు పగిలిపోయాయి. కొన్ని ఇండ్లలో సిమెంట్ కొట్టుకుపోయి కనిపిస్తోంది. కొన్ని చోట్ల మందుబాబులకు అడ్డాగా మారాయి.
ఆందోళనలు చేపట్టినా ఫలితంలేదు..
డబుల్ బెడ్రూం ఇండ్లపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి దృష్టి సారించడంలేదు. దీంతో లబ్ధిదారులు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగూడెం వద్ద బీఆర్ఎస్ మద్దతుతో లబ్ధిదారులు ఇప్పటికే పలుమార్లు ధర్నాకు దిగారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో పలు దఫాలుగా నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్టలో డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయాలని ఇటీవల మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేంద్ రెడ్డి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
అన్ని మండలాల్లో పరిస్థితి ఇదీ..