నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారంనకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కేనపల్లి గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నక్కలపల్లి గ్రామంలో శ్రీ భక్తఆంజనేయ దేవాలయంలో నిర్వహించిన పూజలకు వారు హాజరయ్యారు.
అనంతరం బెండల్ పహాడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని వారు ప్రారంభించారు. అనంతరం పల్లెపహాడ్ గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు.
అనంతరం బాజకుంట గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాన్ని వారు ప్రారంభించారు.
చివరగా అమ్మనబోలు గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి, నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని వారు ప్రారంభించారు. అనంతరం 4 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.