రాజాపేట, డిసెంబర్ 12 : మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేపట్టిన 9వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నాల్గోరోజు మంగళవారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో 8జోన్ల క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ జండగే హనుమంత్ కొండిబా, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఘన స్వాగతం పలికారు. పోటీల అనంతరం కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, బాల్ బాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్, చెస్ ఫైనల్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ హనుమంతు జెండగే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ క్రీడలంటే తనకు చిన్నప్పటి నుంచి ఎంతో మక్కువని, అలాంటి క్రీడలకు ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానన్నారు.
కార్యక్రమంలో ఆర్టీఓ అమరేందర్, ఆర్సీఓలు రజిని, శ్రీరామ్, యాదగిరిగుట్ట జడ్పీటీసీ అనూరాధ, ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, సర్పంచ్ ఆడేపు ఈశ్వరమ్మాశ్రీశైలం, ఎంపీటీసీ దాచపల్లి రాజు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్‌కుమార్, మాజీ సర్పంచ్ అంకతి బాలయ్య, నాయకులు నెమిలే మహేందర్‌గౌడ్, గౌటే లక్ష్మణ్, బాల్‌రాజ్‌గౌడ్, బుడిగె పెంటయ్యగౌడ్, మసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నెమిలే కేథారి, ఇంజ నరేశ్, నవీన్‌కుమార్, గంధమల్ల నర్సింహులు, రాంజీనాయక్, విఠల్‌నాయక్, తాసీల్దార్ దామోదర్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, క్రీడల ఇన్చార్జి ఉదయ్‌భాస్కర్, ప్రిన్సిపాల్ నర్సింహాచారి, అర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, పీడీ వెంకటేశ్వర్లు, పీఈటీ నరేశ్ పాల్గొన్నారు.
ఫైనల్ విజేతలు వీరే..
అండర్-19 విభాగం : కబడ్డీ పోటీల్లో జోన్7 లింగాల, టెన్నికాయిట్‌లో జోన్1 జక్కారం జట్టు, కార్యమ్లో జోన్6 సింగూరు, చెస్ పోటీల్లో జోన్2 రాజ్‌కుమార్ ఇచ్చోడ్, వాలీబాల్ పోటీల్లో జోన్1 కోటపల్లి, బాల్ బాడ్మింటన్ పోటీల్లో జోన్6 పరిగి, ఫుట్‌బాల్ పోటీల్లో జోన్1 జైపూర్ జట్లు గెలుపొందాయి.
అండర్- 17 విభాగం : కబడ్డీ పోటీలో జోన్2 మానకొండూరు, టెన్నికాయిట్ పోటీలో జోన్1 జక్కారం జట్టు, క్యారమ్స్‌లో జోన్1 కాసీపేట, చెస్‌లో జోన్7 బిజేనేపల్ల్లి, వాలీబాల్‌లో జోన్ 5ఏ సింగూరు, బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జోన్2 మానకొండూరు, ఫుట్‌బాల్ పోటీల్లో జోన్5 చండూరు జట్లు గెలుపొందాయి.
అండర్-14 విభాగం : కబడ్డీ పోటీల్లో జోన్7 వెపనగడ్ల, టెన్నికాయిట్ పోటీల్లో జోన్1 జక్కారం, క్యారమ్‌లో జోన్3 కొండపాక, చెస్‌లో జోన్6 షాయిక్పేట్ జట్లు గెలుపొందాయి.