మేళ్లచెర్వు జాతరకు ఏర్పాట్లు చేయాలి
మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మార్చి 8 నుంచి 12 వరకు జరుగనున్న మహా శివ రాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ సూచించారు.
- కలెక్టర్ వెంకట్రావ్
మేళ్లచెర్వు, ఫిబ్రవరి 23 : మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మార్చి 8 నుంచి 12 వరకు జరుగనున్న మహా శివ రాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ సూచించారు. దేవాలయ ఆవరణలో శుక్రవారం ఎస్పీ రాహుల్‌హెగ్డేతో కలిసి జాతర ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. జాతరకు ఇటీవల మంజూరైన రూ. కోటి నిధులతో ఏర్పాట్లు చేయాలని, తాగునీరు, శానిటేషన్, క్యూలైన్లతోపాటు పార్కింగ్‌కు వసతి కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, ఫ్లడ్ లైట్లు పెట్టించాలన్నారు. అనంతరం ఆలయ పరిసరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, ఈఓ గుజ్జుల కొండారెడ్డి, ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్‌రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ ఖాజా అజ్గర్‌అలీ, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, ఎస్ఐ పరమేశ్, పలు శాఖల అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

