భువనగిరి కలెక్టరేట్, జూన్ 24 : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె.జెండగే అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రజావాణిలో 96 ఫిర్యాదులు స్వీకరించగా..
అందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 73, ఉపాధి కల్పన – 3, విద్యాశాఖ – 4, పంచాయతీరాజ్ శాఖ-2, పౌరసరఫరాల శాఖ-2, గురుకుల పాఠశాల – 2, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖ, ల్యాండ్ రికార్డ్స్, ఎంపీడీఓ, వైద్యశాఖ, మత్స్యశాఖ, ట్రాన్స్కో, మున్సిపాలిటీ, ఎస్సీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కో దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్షాలోమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కె.గంగాధర్, జడ్పీ సీఈఓ ఎన్.శోభారాణి, స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ప్రసాద్, సూపరింటెండెంట్ పార్ధసారథి, వివిధ శాఖ ల జిల్లా అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.