నల్లగొండ సిటీ, మే 3 : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ యూనిట్ల మొదటి విడుత సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ను శుక్రవారం నల్లగొండ కలెక్టర్ చాంబర్లో అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి హరిచందన నిర్వహించారు.
నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం కాగా ఈవీఎంల బ్యాలెట్ యూనిట్ల రాండమైజేషన్ను ఈఎంఎస్ల సాఫ్ట్వేర్ ద్వారా చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, నల్లగొండ, మిర్యాగూడ, దేవరకొండ ఆర్డీఓలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.