నిడమనూరు, జూలై 14 : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు ఎంతో మేలు కలుగుతుందని నిడమనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన రూ.4.45,500 విలువైన చెక్కులను మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ధిక స్థోమత లేని నిరుపేదల వైద్య ఖర్చులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా శ్రీనివాస్‌రెడ్డి, నర్సింగ్ విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ ఆలంపల్లి మైసయ్య, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ కోట్ల సైదయ్య, షేక్ జానీపాషా, రూపని కృష్ణ, సిరిషాల యాదగిరి, చిలకల గంగాధర్ పాల్గొన్నారు.