నిడమనూరు, ఆగస్టు 21 : సీఎంఆర్ఎఫ్తో నిరుపేదల వైద్యానికి కొండంత భరోసా లభిస్తుందని నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ పథకం కింద మసిముక్కు వెంకటమ్మ, పందుల యాదయ్యకు మంజూరైన చెక్కులను వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో గురువారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్సింగ్ విజయ్ కుమార్ గౌడ్, మోసాల శ్రీను, మొలక శ్రీనివాస్ రెడ్డి, ఐతగోని మధు, చరక శ్రీను, మెరుగు శ్రీను, ముడి పవన్, కారింగు నరేశ్, గుండెబోయిన శంకర్ పాల్గొన్నారు.