నల్లగొండ ప్రతినిధి, జనవరి 4(నమస్తే తెలంగాణ) : ‘2023 ఎన్నికల సమయంలో ఇదే రేవంత్‌రెడ్డి.. డిసెంబర్ 3 తర్వాత రైతుబంధు డబ్బు లు 5వేలు కాదూ… మేం వస్తే రూ.7,500 ఇస్తాం అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా… నేటీకి రైతుబంధు కాదూ కదా! ఆరు గ్యాంరెటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. వానకాలం రైతుబంధుకు ఎగనామం పెట్టి యాసంగిలో ఇస్తామంటున్న రైతు భరోసాకు షరతులు విధించడం దారుణం. రైతుభరోసా కోసం రైతులను ప్రమాణ పత్రాలు అడగడమంటే అవమానించడమే. ప్రమాణ పత్రాలు ఇవ్వాల్సింది రైతుల కాదూ… రేవంత్‌రెడ్డే అందరికీ రైతుభరోసా ఇస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి’ అని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ రైతుకూ కాంగ్రెస్ ప్రభుత్వం 17,500 రూపాయల రైతుబంధు డబ్బులు బాకీ పడిందని గుర్తు చేశారు. వానకాలంలో రైతుబంధు ఇవ్వలేదని, ఇప్పుడు పంటలు వేస్తేనే రైతుభరోసా అంటే కుదరదని పేర్కొన్నారు. అందరికీ భేషరతుగా రైతు భరోసా ఇవ్వాల్సిందేనన్నారు. అప్పటివరకు రైతుల పక్షాన పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమని స్పష్టంచేశారు.
ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతామని తెలిపారు. శనివారం నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇతర నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మందడి సైదిరెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్‌యాదవ్, బొర్ర సుధాకర్, కేవీ రామారావు, మాలె శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, మారగోని గణేశ్, కొండూరు సత్యనారాయణ, జమాలొద్దీన్ ఖాద్రీ, లొడంగి గోవర్ధన్, రావుల శ్రీనివాసరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, మెరుగు గోపి, అన్వర్ పాషా, జి.జంగయ్య, కంకణాల వెంకట్‌రెడ్డి, దొడ్డి రమేశ్, బొమ్మరబోయిన నాగార్జున, షరీఫ్, కలీ, అవినాశ్, ప్రణీత్ పాల్గొన్నారు.
కోమటిరెడ్డి రాజీనామా చేయాలి
‘రేవంత్‌రెడ్డి పాలన రెండో ఏడాదిలో అడుగు పెట్టినా ఒక్క హామీ కూడా అమలు కాలేదు. ఉన్న పథకాల్లో ఒక్కో దానికి పంగనామాలు పెట్టడానికి కుట్రలు చేస్తున్నరు. నాడు చీకట్లో మగ్గిన వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు కేసిఆర్ కంకణం కట్టుకుని పని చేశారు. 24 గంటల కరెంట్, సాగునీటికి తోడు పెట్టుబడి సాయం ఇచ్చి రైతులు బాగు కోరాడు. వ్యవసాయం బాగుండాలని ఆకాంక్షించారు. రైతుల మేలును ఓర్వలేని కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చారు. రైతు భరోసా రూ.7,500 ఇస్తమన్నరు. ఎటూ పోయింది మరీ కాంగ్రెస్ హామీ. పెట్టుబడి సాయాన్ని ఎగొట్టేందుకే రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నడు. రైతులు డిక్లరేషన్ ఎందుకివ్వాలి.
రేవంత్‌రెడ్డే ప్రతి రైతుకూ రైతుభరోసా ఇస్తానని డిక్లరేషన్ ఇవ్వాలి. రుణమాఫీ ఇంకా 70 శాతం మందికి కాలేదు. ఇప్పుడు రైతుభరోసా కూడా 30శాతం మందికి ఇచ్చి 70శాతం మందికి ఎగనామం పెట్టేందుకు కుట్రలు చేస్తున్నరు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఎటూ పోయాయి. ఏడాదైనా ఇచ్చేందుకు మనసొస్తలేదా? గెలువగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తానని ప్రగల్బాలు పలికిన మంత్రి కోమటిరెడ్డి ఎక్కడ పండుకున్నడు. రేవంత్‌రెడ్డిని ఎందుకు నిలదీస్తలేడు. మాటకు కట్టుబడి ఉండడం చేతగాక పోతే తక్షణమే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు కోమటిరెడ్డి రాజీనామా చేయాలి. హామీలు అమలు చేయలేక కేసిఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి వంటి నేతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, నేతలను ఎక్కడికక్కడే నిలదీయాలి.’
-కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
మళ్లీ దళారీ వ్యవస్థ తెచ్చేందుకే దరఖాస్తులు
‘కేసీఆర్ ఇచ్చిన మాదిరిగానే ఎలాంటి షరతులూ లేకుండా రైతు భరోసాను భూమి ఉన్న ప్రతీ రైతుకు ఇవ్వాలి. రైతుభరోసా కోసం దరఖాస్తులు చేసుకోవడం ఎందుకు? రైతుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. మళ్లీ దరకాస్తుల స్వీకరణ అంటే సమైక్య రాష్ట్రంలోని దళారీ వ్యవస్థను తిరిగి తెరపైకి తేవడమే. గతంలో ఏ ప్రభుత్వ పథకమైనా కాంగ్రెస్ నేతల చేతివాటం లేనిదే ప్రజలకు అందేది కాదు. ఇప్పుడు రైతుభరోసాకు దరఖాస్తుల స్వీకరణ అంటే దళారుల పాలు చేయడమే. భరోసా కావాలంటే కాంగ్రెస్ నేతలను, వీఆర్వోలను సంప్రదించాలా? ఇలాంటి చర్యలతో రైతులను రైతుభరోసాకు దూరం చేయాలని చూస్తే ఊరుకోం. దళారీ వ్యవస్థతో మళ్లీ ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ప్రతీ రైతుకు రైతుభరోసా ఇవ్వాల్సిందే. అప్పటివరకు ఊరుకునేది లేదు.’
-బండా నరేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్
దేశంలోనే దిక్కుమాలిన సీఎం రేవంత్‌రెడ్డి
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో ఏ ఒక హామీ కూడా అమలు చేయలేదు. కేసీఆర్ సర్కారుపై అసత్యాలు మాట్లాడుతూ రెచ్చగొట్టే ధోరణితో కాలయాపన చేస్తున్నరు. రేవంత్‌రెడ్డి అధికారం కోసం హామీలు ఇస్తూ వాటిని అమలు చేస్తామని దేవుళ్లపై ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా దేవుళ్లకే ఎగనామం పెడుతున్నడు. రైతులు రైతుభరోసా కోసం ప్రమాణ పత్రాలు ఇవ్వాలి అనడం ఎందుకోసం. దేశంలోనే దిక్కుమాలిన సీఎం రేవంత్‌రెడ్డి. అందరినీ మోసం చేయడమే వారి లక్ష్యం. ఏడాది పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు తప్పుడు కేసులకు పాల్పడుతున్నరు. పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించే స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారు. గ్రామ స్థాయి నుంచి మంత్రుల వరకు దోచుకుతింటున్నరు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిస్తే రేవంత్ రెడ్డి సరార్ ఇపుడు రాష్ర్టాన్ని అధోగతి పాలు చేయడానికి కంకణం కట్టుకున్నది. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది.’
-చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే
చేతగాక పోతే రాజీనామా చేయాలి
‘వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలను సూటిగా ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏఈఓలు ఉన్నారు. పంటల సాగు సమాచారం వెంటనే తెలుసుకోవచ్చు. రైతుబంధు పథకంలో మంత్రులు సహా అందరూ లబ్ధి పొందిన వాళ్లే. వాళ్లకు తెల్వదా ఎలా అమలు చేయాలో. చిత్తశుద్ధి ఉంటే రైతుభరోసా వెంటనే అందరికీ ఇవ్వచ్చు. కానీ రైతుభరోసాకు ఎగనామం పెట్టి నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. నాలుగో విడుత రుణమాఫీ డబ్బులు ఇంకా పడలేదు. రుణమాఫీ కాని వాళ్లు చాలా మంది ఉన్నారు. పథకాలు అమలు చేయలేక కేసీఆర్ నాయకత్వాన్ని కించపర్చాలని చూడడం తగదు. చేతగాకపోతే పదవులకు రాజీనామా చేయాలి. తుమ్మల సహా ఎవ్వరైనా సరే. రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదు.’
-నల్లమోతు భాసర్‌రావు, మాజీ ఎమ్మెల్యే
ఒక్కో రైతుకు రూ. 17,500 బాకీ
‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలను వంద రోజుల్లో పూర్తి చేస్తామని అధికారంలోకి వచ్చి 400 రోజులు పూర్తి అవుతున్నా ఏవీ అమలు చేయడం లేదు. 2023 డిసెంబర్ 3 తర్వాత రూ.7,500 రైతు భరోసా ఇస్తామని చెప్పి నేటికీ ఇవ్వలేదు. గత ఎన్నికల ముందే కేసీఆర్ యాసంగి రైతుబంధును ఇద్దామని ప్లాన్ చేస్తే అప్పటి కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. అవే నిధులను గత యాసంగిలో 5వేల రూపాయల చొప్పన ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కానీ వానకాలం భరోసాకు ఎగనామం పెట్టారు. ఇప్పుడేమో యాసంగి భరోసాకు కుంటిసాకులు చెప్తున్నారు. ఒక్కో రైతుకు రేవంత్ ప్రభుత్వం రూ.17,500 బాకీ పడింది.
ఆనాడు కేసీఆర్ ఆంక్షలు లేకుండా రైతుబంధు ఇచ్చారు. కానీ నేడు రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలట. రైతులేమైనా దొంగలా? రైతు బంధుకు ఎగనామం పెట్టేందుకే ఇలాంటి డిక్లరేషన్ల కుట్ర. రైతుబంధు డబ్బుల్లో రూ.22వేల కోట్లు దుర్వినియోగమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది నిజమైతే గ్రామాల వారీగా ఆ రైతులెవరో జాబితాలు పెట్టగలరా? పత్తి, మిర్చి, కంది వంటి మెట్ట పంటలు వేసే ప్రాంతాల్లో రెండో పంట వేయడానికి ఆసారం ఉండదు. ఇలాంటి వాళ్లందరికీ రైతుభరోసా ఎగొట్టేందుకే ప్రమాణ పత్రాలు తెరపైకి తెస్తున్నారు. రైతు రుణమాఫీ, భరసా, ధాన్యం బోనస్ ఎంత మందికి ఇచ్చారో గ్రామాల వారీగా జాబితాలు పెట్టే దమ్ముందా ఈ ప్రభుత్వానికి? రైతులను మోసం చేయాలని చూస్తే ప్రభుత్వంపై పోరాటానికి బీఆర్ఎస్ పుడూ సిద్ధమే.’
-ఆర్.రవీంద్రకుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
మూడో పంటకూ అన్నారు.. ఒక్క పంటకే దిక్కులేదు
‘హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న గొప్ప ఆశయంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి పైసా రైతుకు చెందేలా సక్రమంగా అమలు చేశారు. ఇలాంటి పథకంపై రేవంత్‌రెడ్డి తప్పుడు హామీలు ఇస్తూ ఎకరాకు సీజన్‌కు రూ.7,500 ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. రెండు పంటలకు కాదూ.. మూడో పంటకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. అప్పుడు మూడో పంటకు కూడా రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఒక్క పంటకూ ఎందుకు ఇవ్వడం లేదు. వానకాలం రైతుభరోసా ఎగొట్టాడు. యాసంగిలో కొందరికే అంటున్నారు. ఏదో రకంగా రైతులకు భరోసా ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నరు. మూడు పంటలకు ఏమో గానీ కాంగ్రెస్ హయాంలో ఒక పంటకు దికు లేదు. కొవిడ్ కష్టకాలంలో సైతం కేసీఆర్ రైతుబంధు ఆపకుండా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులను మోసం చేసేలా వ్యవహరిస్తున్నది. కౌలు రైతులకు ఎప్పుడిస్తారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది.’
-ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ
ఆంధ్రా సలహాదారులతో పాలన
‘కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను మోసం చేస్తున్నరు. ప్రజా పాలన అని చెప్పి రాక్షస పాలన సాగిస్తున్నరు. రాష్ట్రంలో ప్రజలందరినీ ఏడిపిస్తున్నరు. కేసీఆర్ హయాంలో రాజులా మారిన రైతులను బిచ్చగాళ్లను చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్టంలో ఆంధ్ర పెత్తనంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతున్నది. అందుకే తెలంగాణకు కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు. 13 మంది ప్రభుత్వ సలహాదారుల్లో 8 మంది ఆంధ్రా ప్రాంతం వాళ్లే ఉండడం మన దౌర్భాగ్యం. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, అనిలా వావిల్లా, రఘునాథరెడ్డి, శ్రీరామ కర్రీ, సూర్యదేవర ప్రసన్నకుమార్, ఆదిత్యదాస్, సి.ఆంజనేయరెడ్డి, శ్రీనివాసరాజు వంటి ఆంధ్ర సలహాదారులతో తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందో చెప్పాలి. రైతు రుణమాఫీ సగం కూడా ఇవ్వలేదు. రైతు భరోసా అడ్రెస్ లేదు. ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు ఉన్నది రేవంత్ పాలన. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలి. అప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు తెరుస్తుందేమో. ప్రజల తరుఫున ప్రభుత్వం వెంట పడుతాం. వదిలిపెట్టేది లేదు.’
-కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే