నేరేడుచర్ల, జూన్ 24 : హైదరాబాద్‌లోని మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒంటెద్దు నర్సింహా రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్నటి వరకు భూములు దోచుకున్న రేవంత్ రెడ్డి నేడు కేంద్రంతో కలిసి మెట్రో పేరుతో ఉన్న 30 వేల కోట్ల ఆస్తులను లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ క్రెడిట్‌ను చోరీ చేసే వ్యవహరంలో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒకరినొకరు విమర్శించుకొని, నేడు మెట్రో రైలునే ఆగం చేసే కాడికి వచ్చారని అన్నారు. ఇద్దరు కలిసి ఢిల్లీలో మూడు రోజుల హడావుడి చేసి సాధించింది ఏమిటో బహిరంగా చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో ఎల్అండ్టీకి మెట్రో నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు రాలేదని, నిత్యం ఐదారు లక్షల మంది ప్రయాణించేవారని తెలిపారు. ఎల్అండ్ టీ చెల్లించాల్సిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లుస్తుందని చెప్పి మెట్రోను స్వాధీనం చేసుకొని నిత్యం రూ. 2.50 కోట్లు వడ్డీ చెల్లిస్తూ దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.
మెట్రో వద్ద ఉన్న రూ. 30వేల కోట్ల భూములను దోచుకునే ప్రయ త్నం జరుగుతోందన్నారు. ప్రైవేటు సంస్థల చేతిలో ఉన్న మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, ప్రభుత్వ చేతిలో ఉన్న యాదాద్రి పవర్ ప్లాంటును ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వచ్చిన కాడికి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఢిల్లీలో దోస్తీ చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను రేవంత్ రెడ్డి, మంత్రి కిషన్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నీ కాకిలెక్కలు చెబుతున్నాడని, గత సీజన్లో 52లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెప్పాడని అన్నారు. రాష్ట్రంలో మొ త్తం ఒక కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం, 52లక్షల మె ట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం ఏమిటో చెప్పాలని అన్నారు.
యూరియా కోసం తెచ్చిన యాప్ ఒపెన్ చేస్తే మొత్తం ప్రైవేటు దుకాణాల పేర్లే వస్తున్నాయని అన్నా రు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చే యాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యూరియా అందుబాటులో ఉంచడంతో పాటు రైతు బంధు ప్రతి వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే వారి అకౌంట్లలో నగదు జమ చేశారని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దొండపాటి అప్పిరెడ్డి, అరిబండి సురేశ్‌బాబు, నాగండ్ల శ్రీధర్, చెన్నబోయిన సైదులు, అన్నపు రెడ్డి నారాయణ రెడ్డి, చందమళ్ల జయబాబు, కొప్పుల సైదిరెడ్డి, కడియం వెంకటరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, కేఎల్ఎన్ రెడ్డి, చిత్తలూరి సైదులు, మార్కండేయ, సుందరయ్య, పిచ్చిరెడ్డి, హుస్సేన్, రాజేష్, రాములు, శ్రీను, భరత్, పసుపులేటి సైదులు ఉన్నారు.