ఆలేరు, మే 20 : కుల వృత్తిదారులకు లక్ష రూపాయల మంజూరు నిర్ణయాన్ని హర్షిస్తూ పట్టణంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వృత్తిదారులు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలా ఆదుకునే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కుల వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇందుకు కుల వృత్తిదారులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. కార్యక్రమంలో కుల వృత్తిదారుల సంఘం నాయకులు ముదిగొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్‌కుమార్, తుని కి గణేశ్, ఆలేటి భాసర్, బాలకిషన్, అశోక్, సం తోష్, ఉపేందర్, కృష్ణ, కాసులబాద శివ, పాండు, ఉపేందర్, రంగబాబు, రాము, సుభాశ్, కనికరం భిక్షపతి, హరిబాబు, కిశోర్ పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : కుల వృత్తులను ఆదరించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు కొనియాడారు. కుల వృత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి ఫ్లెక్సీకి శనివారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కుల వృత్తులను పట్టించుకోలేదని విమర్శించారు. కనుమరుగవుతున్న కుల వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆరేనని కొనియాడారు. కుల వృత్తిదారులకు లక్ష సాయం చేయాలని నిర్ణయించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు సలిగంటి గంగయ్య, లింగాల గుంషావలీ, సలిగంటి పిచ్చయ్య, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు జంపాల శ్రీను, ఎల్గపల్లి సైదులు, రజక సంఘం చెరుకు వెంకన్న, సులుగురు జయమ్మ, సోమయ్య, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకుడు సలేంద్రచారి, కడవెండి సతీశ్, కటికం దయాకరచారి, అమరవాది శ్రవణ్, మేడారపు బ్రహ్మచారి, కంచర సంఘం నాయకులు పర్వతం శంకరాచారి, తంగెళ్లపల్లి నర్సింహాచారి పాల్గొన్నారు.
శనివారం మధ్యాహ్నం.. నల్లగొండ జిల్లాకేంద్రం.. వృత్తిదారులు వేర్వేరుగా రెండు కార్యక్రమాలు చేపట్టారు. ఒకటి.. స్వరాష్ట్రంలో వృత్తులకు పునరుజ్జీవం పోసి, తాజాగా లక్ష రూపాయల ఆర్ధిక సాయంతో అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్షీరాభిషేకం. ఈ కార్యక్రమంలో దాదాపు అన్ని వృత్తులవారు సంతోషంగా పాల్గొన్నారు.