నల్లగొండ సిటీ, జులై 09 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు అలాగే మిగతా అన్ని రకాల పెన్షన్లను రూ.4 వేలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేశ్ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండ పట్టణం అంబేద్కర్ భవన్లో వీఎచ్పీఎస్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సదస్సు వెంకన్న యాదవ్ అధ్యక్షన జరిగింది. సదస్సు గోవింద్ నరేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హమీల మీద హమీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తుందన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దివ్యాంగులకు రూ.6 వేలు అలాగే మిగతా వారికి 4 వేలు పెంచుతామన్నా రేవంత్రెడ్డి దానిని నిలబెట్టుకోలేదన్నారు. పింఛన్ల పెంపు కోరుతూ ఈ నెల 14న జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు మందకృష్ణ మాదిగ రానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, మేడి శంకర్, కొమిరే స్వామి, సుదర్శన్, కమలమ్మ, చిన్న, ప్రసాద్ పాల్గొన్నారు.