చండూరు, జూన్ 27: న్యాయం కోసం పోలీస్టేషన్‌కు వచ్చిన ఓ రైతును ఎస్సై పిడిగుద్దులు గుద్ది, చితకబాదిన ఘటన చండూరు పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఇందుకు సంబంధించి బాధితుడు ఆవు ల వెంకన్న శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాస్కానిగూడెం గ్రామానికి చెందిన తనకు తన బాబాయికి గత నెల 23న గెట్టు పంచాయితీ విషయమై వివాదం తలెత్తడంతో తనపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని తెలిపారు.
దీం తో స్థానిక ఎస్సై నార్సింగ్ వెంకన్న ఇరువర్గాల వారిని పిలిచి గ్రామంలోని పెద్దమనుషుల సమక్షంలో వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. అయి తే అందుకు అవతలి వర్గం వారు అంగీకరించలేదు. దీంతో ఎస్సై గురువారం తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి “ను వ్వే పెద్దమనుషుల మాట వినడం లేదం ట., అంటూ నేనే నీకు పెద్దమనిషినం టూ అసభ్యంగా తిడుతూ, కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ కిండపడేసి కాలి తో తన్ని, తలపై బలంగా కొట్టాడని రోది స్తూ తెలిపాడు.
నా తప్పు లేకున్నా ఎం దుకు కొడుతున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేస్తా.. అంటే ఎస్పీకి కాదు నీకు దిక్కున్న వారితో చెప్పుకో అంటూ త్రీవ పదజాలంతో దూషించాడన్నారు. తాను అక్క డ స్పృహ తప్పి పడిపోవడంతో కుటుం బ సభ్యులు స్థానిక ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారన్నారు. ఎస్సై చండూరుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి బాధితులపైనే కేసులు పెడుతూ న్యాయం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చే యాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు వెంకన్న తెలిపారు.