చండూరు, ఏప్రిల్ 06 : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా చండూరు మండలంలో సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో మాజీ ఎంపీపీ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తోకల చంద్రకళ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.1.10 లక్షలను విరాళంగా ప్రకటించారు.
అదేవిధంగా లక్కినేనిగూడెం వార్డులో ఉన్న శ్రీ రామాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వ్యవస్థాపకులు భీమ్ రెడ్డి మంజుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన అనంతరం పూజలు నిర్వహించారు.