Chandur Jatara | మార్చి నాలుగో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ చండూరు జాతర జరుగనున్నది. శుక్రవారం మార్కండేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన సమావేశంలో దేవాలయ చైర్మన్ రావిరాల నగేష్ జాతర కరపత్రాలను విడుదల చేశారు. మార్చి నాలుగో తేదీన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, 6న గాయత్రి యజ్ఞం, 7న విమాన రథోత్సవం, 8న అగ్నిగుండాలు, 9న భూ,నీళా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ సమావేశానికి దేవాలయ చైర్మన్ రావిరాల నగేష్ సారధ్యం వహించారు. ఈ సమావేశంలో కోమటి వీరేశం, గుర్రం బిక్షమయ్య, పులిపాటి ప్రసన్న, గుంటి వెంకటేశం, గంజి శ్రీనివాసులు, చిట్టిప్రోలు వెంకటేశం, చెరుపల్లి వెంకటేశం,చెరుపల్లి అంజయ్య, రావిరాల నగేష్, కోడి వెంకన్న, కోడి శ్రీనివాసులు,రాపోలు వెంకటేశం జూలూరు వెంకటేశం,తిరందాసు శ్రీనివాసులు, దుస్స గణేష్, సంగెపు మల్లేష్, రాపోలు ప్రభాకర్, గుంటి యాదగిరి, గంజి గంగాధర్, అశోక్, కలిమికొండ కిరణ్, చిలుకూరి మణికుమార్, బొల్ల శ్రీకాంత్, తిరందాసు భాస్కర్,గంజి భిక్షం, చెరుపల్లి సాయి, ఏలే శ్రీనివాసులు, ఆలయ పూజారులు గుర్రం సత్యనారాయణ, చెరుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.