గట్టుప్పల్, ఏప్రిల్ 02 : గట్టుప్పల్ మండల పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్ర చౌరస్తాలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రంను మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి సందర్భంగా మండల కేంద్రానికి ఇతర గ్రామాల నుండి వచ్చే ప్రజల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పద్మశాలి సంఘం సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో చండూరు మాజీ ఎంపీపీ అవ్వారి గీతాశ్రీనివాస్, ఎస్ఐ గుత్తా వెంకట్రెడ్డి, మాజీ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్, పారిశ్రామికవేత్త ఇడం శ్రీనివాస్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు పున్న కిశోర్, ఉపాధ్యక్షుడు తిరందాసు రాములు, కార్యవర్గ సభ్యుడు చెరుపల్లి సత్తయ్య, శివాలయం అధ్యక్షుడు మాధగాని సత్తయ్య, పద్మశాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు కర్నాటి వెంకటేశం పాల్గొన్నారు.