గుర్రంపోడ్, ఫిబ్రవరి 26 : ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని చామలేడు గ్రామంలో పంచాయతన ఉమామహేశ్వర స్వామి, దుర్గమ్మ, గౌరమ్మ దేవతల విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గాలి సరితా రవికుమార్, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, ఎంపీటీసీ దోటి చంద్రమౌళి, నాయకులు పాల్గొన్నారు.