నీలగిరి, జూలై 19 : నిత్యావసర వస్తువుగా మారిన సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారికి సీఈఐఆర్ పోర్టల్ ఒక వరం లాంటిదని నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సెల్‌ఫోన్ పోగొట్టుకున్న 35 మంది బాధితులకు ఫొన్లను తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సెల్ఫొన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌కు లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే పోయిందనుకున్న సెల్‌ఫోన్‌ను తిరిగి రికవరి చేసే వీలుంటుందన్నారు.
సెల్‌ఫోన్ పోయిన వెంటనే సిమ్ ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫోన్ వివరాలు, పోగొట్టుకున్న ప్రదేశం, చిరునామా సరిగ్గా నమోదు చేయించాలన్నారు. అప్పుడు సెల్‌ఫోన్‌ను ట్రాక్ చేసి తెప్పించడం జరుగుతుందన్నారు. పోయిందనుకున్న సెల్‌ఫోన్ దొరకడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ గోపాల్‌రావు, ఏఎస్ఐ వెంకన్న, సైబర్ వారియర్ సత్యనారాయణ పాల్గొన్నారు.