నీలగిరి, జూన్ 1: తన కూతురు మృతికి కారణమైన సీసీఎస్ సీఐ డానియల్‌ను సస్పెండ్ చేయాలని మృతురాలి తల్లి పద్మ ఆదివారం రాత్రి నల్లగొండ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. గతేడాది కుటుంబ సమస్యలతో న్యాయం కోసం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ తో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అతడిని ఐజీ కార్యాలయానికి అటాచ్ చేసిన విషయం తెలిసిం దే.
సీసీఎస్ సీఐగా ఉన్న డానియల్ గతనెల 22న పానగల్‌లోని ఛాయాసోమేశ్వర ఆలయానికి రమ్మని చెప్పడంతో తన కుతూరు వెళ్లిందని తెలిపారు. వారు రోడ్డు పక్కన నడుస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం వచ్చి ఆమెను ఢీకొట్టడంతో తీవ్రగాయాలై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
శిల్పతో సంబంధం పెట్టుకుని కుటుంబం ఛిన్నాభిన్నం చేసి మరణానికి కారణమైన డానియల్‌ను సస్పెండ్ చేయాలని శిల్ప పిల్లలతో కలిసి మృతురాలి తల్లి నిరసన తెలిపింది. ఘటనాస్థ్దలానికి వచ్చిన సీఐ రాఘవరావు న్యాయం చేస్తామనడంతో ఆందోళన విరమించింది. దీంతో తండ్రి గ్రామమైన పిట్టలగూడేనికి మృతదేహాన్ని తరలించారు.