పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
నల్లగొండలోని భవిత ఇనిస్టిట్యూట్‌లో బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు బుసిరెడ్డి పౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి (పాండన్న) ఉచిత స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
– ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు ఉచిత స్టడీ మెటీరియల్
– పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి
రామగిరి, అక్టోబర్ 03 : నల్లగొండలోని భవిత ఇనిస్టిట్యూట్‌లో బుసిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు బుసిరెడ్డి పౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి (పాండన్న) ఉచిత స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో ప్రతిరోజూ తరగతులకు హాజరవుతూ కనీసం మూడు గంటలు క్రమం తప్పకుండా చదవాలని సూచించారు. మెయిన్స్ పరీక్షలకు ఉపయోగపడేలా మెటీరియల్ అందించామని, పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి భవిత ఇనిస్టిట్యూట్, ఫౌండేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
యువత ఉద్యోగ సాధనకు బుసిరెడ్డి ఫౌండేషన్ ప్రోత్సాహం ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భవిత ఇనిస్టిట్యూట్ నిర్వాహకులు వెంకటరెడ్డి, ఎకనామిక్స్ లెక్చరర్ నరేష్, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ యడవెల్లి దిలీప్ రెడ్డి, కొప్పోలు రామాలయ చైర్మన్ ఐతగోని పరమేష్ గౌడ్, నల్లగొండ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు ఓర్సు వెంకట్, కోడుమూరు వెంకట్‌రెడ్డి, ఉప సర్పంచ్ గజ్జల శివారెడ్డి, సోమయ్య, నిమ్మల శ్రీకాంత్‌రెడ్డి, గజ్జల నాగార్జునరెడ్డి, శిశిధర్‌రెడ్డి, అనుముల శ్రీను, వేణు, సాయికుమార్, వైడీఆర్ బీపీఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.

పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
Supriya Sule | సుప్రియా సూలే అల్లుడికి చెందిన సంస్థకు.. 1,200 ఎకరాల భూమిని లీజుకిచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

