
నల్లగొండ: పెట్రోల్, డీజిల్‌ను వినియోగదారులకు స్వచ్ఛంగా విక్రయించాలని వాటిని కల్తీ చేసినా లేదా ఫీడింగ్ పేరుతో తక్కువ పరిమాణం పోసినా చర్యలు తీసుకుంటామని జిల్లా సివిల్ సైప్లె అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో కలిసి పట్టణంలోని పెట్రోల్ బంకులను పరిశీలించి పెట్రోల్, డీజిల్‌ల క్వాలిటీ, క్వాంటి టీని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడుతూ ప్రతి బంక్‌లో ఇంధనం విషయంలో రాజీ లేకుండా విక్రయాలు చేపట్టాలని ఆదేశిం చారు. ధరల విషయంలో ప్రభుత్వం చేస్తున్న హెచ్చు తగ్గులను సైతం సమయం ప్రకారమే అమలు చేయాలని, ధర తగ్గి నా అదే రేటును ఉంచటం.. పెరిగితే వెంటనే అమలు చేయటం లాంటివి చేపడితే ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి బంక్‌లో టాయిలెట్లతో పాటు ఎయిర్, నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్బంగా బంకుల్లో ఐదు లీటర్ల చొప్పున పెట్రోల్ తీసి దాని పరిమాణం లెక్కించారు.
అనంతరం సివిల్ సైప్లె డిప్యూటీ తహసీల్దార్లకు బంకుల్లో తనిఖీలు చేసే సమయంలో అనుసరించే నిబంధనలపై సేల్స్ ఆఫీసర్లు అవగాహన కల్పించారు. అనంతరం తూనికల కొలతల అధికారి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 18 బంకులపై కేసులు పెట్టి 2.90లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు.
బంకుల్లో మోసాలు చేస్తే ఉపేక్షించేది లేదని వినియోగదారులు ఏవైనా అనుమానాలు ఉంటే 9010651783 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని బంకులకు సంబంధించిన ఇంధనం చెకింగ్ కోసం పంపించారు. ఆయన ఏఎస్వో నిత్యానంద్, డీటీ సివిల్ సైప్లెలు రమ్య, నందిని తదితరలు పాల్గొన్నారు.