కోదాడ : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం( BRS victory ) ఖాయమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallayya Yadav ) ధీమాను వ్యక్తం చేశారు . ఆదివారం పట్టణంలోని 27వ వార్డులో మహమ్మద్ కాజా , షరీఫ్ మహమ్మద్ కాలిబ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని బీఆర్ఎస్ హయాంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న రెండు సంవత్సరాల కాలంలో కోదాడ పట్టణం అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. పారిశుధ్య లోపంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే దిక్కే లేదన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలు అయ్యేంతవరకు అప్రమత్తతతో ఉండాలని, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించి ఓట్లను అభ్యర్థించాలని పేర్కొన్నారు .