భువనగిరి అర్బన్, ఏప్రిల్ 22 : వరంగల్‌లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు దండులా కదిలిరావాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దీంతో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చిందని అన్నారు. పదేండ్ల పాలనతో దేశంలో రాష్ర్టాన్ని అదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు.
జిల్లా నాయకుడు కొలుపుల అమరేందర్, మండలాధ్యక్షుడు జనగాం పాండు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, మాజీ ఎంపీపీ అతికం లక్ష్మీనారాయణగౌడ్, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు రమేశ్, మధుసూదన్‌రెడ్డి, వెంకట్, యశీల్, ర్యాకల శ్రీనివాస్ పాల్గొన్నారు.