సూర్యాపేట టౌన్, జనవరి 16 : ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరుగనున్న బీఆర్ఎస్ ,మొదటి బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే దేశ అభివృద్ధ్ధిలో పెను మార్పులు సంభవించడం ఖాయమన్నారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధి పాలనను అన్ని రాష్ర్టాలు కోరుకుంటున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం యావత్ దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, గుడిపూడి వెంకటేశ్వరరావు, బండారు రాజా, సయ్యద్, శ్రీనివాస్, శ్రీను, వినయ్, శంకర్, షకీల్ పాల్గొన్నారు.