పాలకవీడు మార్చి 18 : పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలపై నిషేదం విధించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు సతీశ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యను నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్కు తరలిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సతీశ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశేష సాధన చేసిన ఉస్మానియా గడ్డలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలను రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వ చర్యను నిరసిస్తున్నతమను ఇండ్లలోకి వచ్చి ముందస్తు అరెస్ట్లు చేయడం హేయం అన్నారు. అక్రమ అరెస్టులతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, వీరబాబు, నాగేశ్వరరావు, మురళి, శేఖర్ పాల్గొన్నారు.