మద్దిరాల, మే 3 : పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తా, అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ నేతృత్వంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఎంపీలే మాట్లాడడం జరుగుతుందన్నారు.
తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో రాజీలేని పోరాటం చేసి నిధులు తీసుకువస్తామని చెప్పారు. భువనగిరి ఉద్యమాల ఖిలా కాబట్టి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ను ఆదరించి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. సమావేశంలో జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగేంధర్‌రావు, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, మండలాధ్యక్షుడు ఎస్ఏ రజాక్, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరాంరెడ్డి, నాయకులు కుందూరు విష్ణువర్ధన్‌రెడ్డి, మల్లు కపోతంరెడ్డి, దుగ్యాల రవీందర్రావు, వడ్డాణం మధుసూదన్, రావుల వెంకన్న, శిరంశెట్టి వెంకన్న, మారెల్లి యాకయ్య, వెంకన్న పాల్గొన్నారు.
నూతనకల్ : అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, యాద్రాది భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.