కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని బీఆర్ఎస్ భువనగరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పైళ్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బీబీనగర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తామని హామీ ఇచ్చారని, అది వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. నృసింహ సాగర్ రిజర్వాయర్‌లో సర్వం కోల్పోయిన బాధితులకు అండగా ఉంటానని, బీఎన్. తిమ్మాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.
బీబీనగర్, నవంబర్ 24 : రైతు ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని, ప్రజలు ఆలోచించి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని ఎర్రబెట్టెతండా, అన్నంపట్ల, జైనపల్లి, గూడూరులో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ దళిత బంధు అందజేస్తామని, ఎవరూ అపోహపడొద్దని సూచించారు. దళిత బంధు కోసం రూ.110కోట్లు విడుదలయ్యాయని ఎన్నికల అనంతరం అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీబీనగర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తానని హామీ ఇచ్చారని, బీబీనగర్‌కు మెట్రో వస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని, ఆ నాయకులు రాష్ర్టానికి వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నారని, గంటలు కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కోరారు. కర్ణాటక మోడల్‌ను నమ్ముకుంటే కటిక చీకట్లోకి బతకాల్సివస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారని, భవిష్యత్‌లో మరిన్ని పథకాలు తీసుకువస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రభుత్వం పంచిన భూములను అమ్మే హకును కల్పిస్తదని, ప్రజలు ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని ప్రతి పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ మొరిగాడి బాలమల్లేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు పర్వతం శ్రీశైలం, భుక్క లక్పతి, సోము శ్రీనివాస్, పోనుగంటి నర్సింహాచారి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచాల రవికుమార్, బీఆర్ఎస్ నాయకులు గాదె నరేందర్‌రెడ్డి, ఆకుల ప్రభాకర్, సురకంటి సుధాకర్‌రెడ్డి, మల్లగారి శ్రీనివాస్, మన్నె బాల్‌రాజు, సోము రమేశ్, గుంటిపల్లి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.